రక్త దానం ప్రాణ దానమే. నూతన సమ్వత్సర సందర్భంగా తెలంగాణ ఎలివేటర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కిమ్స్ ఆసుపత్రిలో,   రక్తదాన కార్యక్రమానికి బ్రహ్మాండమైన స్పందన లభించింది. లిఫ్ట్ కార్మికులు, మానుఫక్టురెర్స్, లిఫ్ట్ కంపనీ యాజమన్యులు,  ఈ పుణ్య కార్యంలో పాల్గొన్నారు.

 

కిమ్స్ హాస్పిటల్ యాజమాన్యం ఇందుకు అనుకూలంగా స్పందించి, అసోసియేషన్ ప్రెసిడెంట్ అవినాష్ చల్లా గారిని అభినందిచింది. రక్త దానం చేసిన ప్రతి ఒక్కరికీ కిమ్స్ వారు సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది.

 

ఈ సంధర్భంగా అవినాష్ గారు మాట్లాడుతూ, లిఫ్ట్ ఇండస్ట్రీ అంటేనే సేవకు సంభందించినదని, సైనికులు దేశం కోసం శ్రమించినట్లే, పొట్టకూటికోసం  లిఫ్ట్ కార్మికులు ప్రాణాలు పనంగా పెట్టి పనిచేస్తుంటారని, వారందరూ ఏ మంచిపనికైనా ముందుంటారని, అందులో భాగంగా – ఈరొజు రక్త దానం చేసి వారి అందరికి లిఫ్ట్ ఇండస్ట్రీపై వున్న ప్రేమను వ్యక్త పరిచారు.

 

లిఫ్ట్ ఆక్ట్ తెలంగాణాలో అమలులోకి రావటం ద్వార,  లిఫ్ట్  ప్రమాదాలను అరికట్టగలమని,  ఎంతో మంది ప్రాణాలను కాపాడుకోగలమని, అందుకు ప్రభుత్వం కూడా అనుకూలంగా స్పందించిన విషయాన్ని గుర్తుచేసారు. ఈ కార్యక్రమంలో పాలుగొన్న ప్రతిఒక్కరిని అభినందిస్తూ,  మున్ముందు మరిన్ని మంచి కార్యక్రమాలు ప్రతి నెల చేపడతమాన్ని,  తెలియజేశారు.  

Ask Everyone To Join the Moment for our Integrity

If you are interested in working together, fill the form and we will get back to you as soon as we can!